Saturday, March 22, 2025

‘మెగా’ సన్మానం వెరీ కాస్ట్‌లీ

ఇండస్ట్రీలో సన్మానం అంటే చాలు ఇక అది చాలా గొప్పగా ఫీలయిపోతుంటారు మనవాళ్ళు. ఆ సన్మానం దేనికి సంబంధించి.. ఎవరు చేస్తున్నారు. చేసేవాళ్ళు మననుంచి ఏమన్నా ఆశిస్తున్నారా ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ముందు ఇన్విటేషన్‌ వచ్చిందే చాలనుకుంటారు. మరి ఇప్పుడు అలాంటి సన్మాన సభే ఒకటి మెగాస్టార్‌ చిరంజీవికి జరిగింది.

ఇక మన హీరోలు విదేశీ సంస్థలు అనగానే ముందు వెనుక ఆలోచించరు. ప్రైవేట్‌ సంస్థ లేదా ట్రస్ట్‌ లాంటిది ముందుకు వచ్చి సన్మానం అనగానే ఆనందంగానే ఉంటుంది. దానికి మనవాళ్ళు ఏఖంగా యుకె ప్రభుత్వం సన్మానం చేసినట్లు హడావిడి చేశారు. ఇక ఇలాంటి సన్మానం వేరెవరికీ జరగలేదంటూ… అక్కడ సంస్థలు ప్రభుత్వానికి అప్లయ్‌చేస్తే, నిర్ణీత నిబంధనలు పాటిస్తే, నిర్ణీత ఫీజ్‌ చెల్లిస్తే పార్లమెంట్‌ లేదా కౌన్సిల్‌ హాలులో ఫంక్షన్‌ చేసుకోవడానికి అనుమతిస్తారు. ఎలాగూ అక్కడి పెద్దలను కొందరిని పిలుస్తారు. దీన్ని పట్టుకుని, బ్రిటన్‌ ప్రభుత్వమే మెగాస్టార్‌ను గౌరవిస్తోందని, సన్మానం చేస్తోందని హడివిడి చేసేశారు.

మెగాస్టార్‌ ఈ సన్మానం కార్యక్రమానికి ఆహ్వానం అందుకోవడం కోసం కొంత డొనేషన్‌ కూడా తీసుకున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా అఫీషియల్‌ గానే. అయితే ప్రయివేట్‌ సంస్థలు ఫండ్‌ రైజింగ్‌ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం కామన్‌. అందులో భాగంగానే మెగాస్టార్‌ సన్మానం జరిగిందని ఇప్పటికి క్లారిటీ వస్తోంది. ఇలా డబ్బులు వసూలు చేయడం సరికాదు, వెనక్కు ఇచ్చేస్తారు అంటూ విచారం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఓ ట్వీట్‌ వేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com