మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుమారు 25 రోజులుగా ఆయన చికెన్ గున్యాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తన నివాసంలోనే ఇందుకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చిరంజీవి. ఇప్పుడిప్పుడే చికున్ గున్యా నుంచి క్రమంగా కోలుకుంటున్నారట. ఈ క్రమంలోనే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల పిలుపు మేరకు ఒంటినొప్పుల తోనే ఈ ఈవెంట్ కు హాజరయ్యారు చిరంజీవి. స్టేజ్ పైకి వెళుతున్న సమయంలో కూడా మెగాస్టార్ మేనల్లుడు హీరో సాయి ధరమ్‌తేజ్ చిరంజీవికి సాయంగా వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
మోగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు గానూ చిరంజీవికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్‌లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ సర్టిఫికెట్ ను అందుకున్నారు చిరంజీవి. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు