Friday, April 18, 2025

చికెన్ గున్యాతో బాధపడుతున్న మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుమారు 25 రోజులుగా ఆయన చికెన్ గున్యాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తన నివాసంలోనే ఇందుకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చిరంజీవి. ఇప్పుడిప్పుడే చికున్‌ గున్యా నుంచి క్రమంగా కోలుకుంటున్నారట. ఈ క్రమంలోనే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల పిలుపు మేరకు ఒంటినొప్పుల తోనే ఈ ఈవెంట్ కు హాజరయ్యారు చిరంజీవి. స్టేజ్‌ పైకి వెళుతున్న సమయంలో కూడా  మెగాస్టార్ మేనల్లుడు హీరో సాయి ధరమ్‌తేజ్‌ చిరంజీవికి సాయంగా వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
మోగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల డ్యాన్స్‌ మూమెంట్స్‌ చేసినందుకు గానూ చిరంజీవికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్‌లో గిన్నిస్‌ బుక్‌ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ సర్టిఫికెట్ ను అందుకున్నారు చిరంజీవి. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com