Saturday, February 22, 2025

మేం రాలేం కేఆర్‌ఎంబీకి ఏపీ షాక్‌

కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రత్యేక, అత్యవసర సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరుకాలేమని, వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం జరుగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం అందించామని అధికారులు వెల్లడించారు. కాగా, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తున్నదని, వెంటనే అడ్డుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశారు. రెండు ప్రాజెక్టుల పరిధిలో 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో బోర్డు చైర్మన్‌ అతుల్‌ జైన్‌ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఏపీ విజ్ఞప్తితో సమావేశం వాయిదాపడింది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com