సెన్సేషనల్ కంపోజర్- ట్యాలెంటెడ్ యాక్టర్ జివి ప్రకాష్ కుమార్, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్స్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో కంటెంట్ బేస్డ్ మూవీ ‘మెంటల్ మనదిల్’లో హీరోగా నటిస్తున్నారు. సూపర్ స్టార్ ధనుష్ సోషల్ మీడియా ద్వారా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసి సినిమా గొప్ప విజయం సాధించాలని టీంని విష్ చేశారు. ఈ చిత్రంలో మాధురీ జైన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అరుణ్ రామకృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలాజీ ఎడిటర్, ఆర్.కె. విజయ్ మురుగన్ ఆర్ట్ డైరెక్టర్. దినేష్ గుణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్యారలల్ యూనివర్స్ ప్రొడక్షన్ హౌస్ కోసం జి వి ప్రకాష్ కుమార్ దీనిని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ కంటెంట్-డ్రివెన్ హీరోగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ‘7G రెయిన్‌బో కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరు’ లాంటి క్లాసిక్స్ అందించిన సెల్వరాఘవన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.