Saturday, May 3, 2025

మెట్రో భారం.. ఇక తప్పడు చార్జీల పెంపునకు నిర్ణయం

హైదరాబాద్ మెట్రో చార్జీలు త్వరలో పెరగనున్నాయి, ప్రస్తుతం రూ.6,500 కోట్ల నష్టాలతో కొనసాగుతున్న మెట్రో సంస్థ ప్రయాణికుల సంఖ్యలో స్థిరత్వం లేక, ఖర్చులు పెరగడంతో త్వరలో చార్జీలు పెంచనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ టికెట్ ధరలపై ఎలాంటి మార్పులు జరగకపోవడంతో ఇప్పుడు పెంపు తథ్యంగా మారింది. మెట్రో ప్రారంభించినప్పుడు రూ.10 నుంచి రూ.60 వరకు ఉన్న టికెట్ ధరలు గత ఏడున్నర సంవత్సరాలుగా అలాగే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు, మెట్రో నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థ ఈ ధరలపై పునఃపరిశీలనకు సిద్ధమవుతోంది. తాజాగా సంస్థ సీఈఓ, ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, ధరల పెంపు అనివార్యం అంటూ చెప్పుకొచ్చారు. “నిర్వహణ ఖర్చులు గత కొద్ది సంవత్సరాల్లో 160 శాతం పెరిగాయి. మొత్తం నష్టాలు రూ.6,598 కోట్లు దాటిపోయాయి. తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో ఒత్తిడి మరింత పెరిగింది,” అని తెలిపారు. అందుకే సంస్థకు ఇప్పుడు టికెట్ ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ 2023లో చేసిన సిఫార్సులను కూడా సంస్థ చేతిలో పెట్టుకుంది.
ప్రస్తుతం రద్దీ సమయాల్లో మెట్రో సేవలను మరింత మెరుగుపరచాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, సంస్థకు కావాల్సిన కొత్త ట్రైన్ల కొరత ఉంది. నాగపూర్ వంటి ఇతర మెట్రో సంస్థల నుంచి లీజ్ తీసుకోవాలన్న ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అందుకే స్వదేశీ తయారీదారుల మీద ద్రుష్టి పెట్టి, మూడు కోచ్‌లతో కూడిన 10 ట్రైన్ సెట్ల కొనుగోలుకు ముందడుగు వేసింది. ఇందులో మొదటి దశలో ఐదు ట్రైన్ సెట్ల కొనుగోలుకు టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఖర్చు రూ.400 నుండి రూ.450 కోట్ల మధ్యగా ఉంటుంది. ఈ కొత్త ట్రైన్ సెట్లు ప్రస్తుతం ఉన్న 57 ట్రైన్ సెట్లతో కలిసి 69.2 కి.మీ పరిధిలో ఉన్న మూడు కారిడార్లలో తిరుగుతాయి. వాటిని పూర్తి స్థాయిలో సేవలలోకి తీసుకురావడానికి ఒప్పందం కుదిరిన తర్వాత పని పూర్తవ్వడానికి కనీసం 15 నెలల సమయం పడుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com