Monday, November 18, 2024

ప్రయాణికులతో మెట్రోస్టేషన్‌లు కిటకిట

గణేశులను చూడడానికి భక్తుల రాక
మెట్రోస్టేషన్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల ఉన్న గణేశులను చూడడానికి చాలామంది భక్తులు మెట్రోలను ఆశ్రయిస్తుండడంతో మెట్రో స్టేషన్‌లలో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం ఇటు ఎల్బీనగర్ వైపు నుంచి అటు మియాపూర్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారుతున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఖైరతాబాద్ గణేశుడికి భక్తుల తాకిడి పెరిగింది.

 

దీంతో మెట్రో రైలు యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వ్యవహారిస్తోంది. దీంతోపాటు నిమజ్జనానికి మూడు రోజుల సమయం ఉన్నందుకు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టికెట్ కౌంటర్ల వద్ద, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు. క్యూఆర్ కోడ్ టికెట్లకు, కార్డు ద్వారా ప్రయాణించే ప్రయాణికులను వేర్వేరుగా స్టేషన్‌లోకి పంపిస్తున్నారు. స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, కార్డులో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్‌లో రీఛార్జ్ చేసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular