Friday, September 20, 2024

నేడు మెట్రో సేవల పొడిగింపు

  • నేడు మెట్రో సేవల పొడిగింపు
  • చివరి రైలు రాత్రి ఒంటి గంటకు బయలుదేరి, రాత్రి 2 గంటలకు
  • గమ్యస్థానాలకు చేరుకుంటుంది
  • మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి

హైదరాబాద్‌లో నేడు జరిగే గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని మెట్రోరైళ్ల సమయాన్ని పొడిగించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం అన్ని మెట్రో రూట్‌లలో అర్థరాత్రి సమయం వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని ప్రారంభ మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 1 గంటకు బయలుదేరి, రాత్రి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని ఆయన వెల్లడించారు. రద్దీని బట్టి ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్‌లలో అదనపు టికెట్ కౌంటర్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్‌లలో మహిళల భద్రత కోసం అదనపు పోలీసులను కూడా నియమిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నిమజ్జనాలను చూసేందుకు తరలి వచ్చే భక్తులు మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు ఆయన సూచించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular