అల్లు అర్జున్ వ్యవహారంపై నెటిజన్లు ఫైర్
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ రియాక్షన్, ఆయనకు సపోర్ట్ చేసిన వారి యాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యంతర బెయిల్‌పై ఉన్న బన్నీ రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. మరి కొద్ది రోజుల్లో తుది తీర్పు ఇవ్వనున్నది. అయితే బన్నీ బెయిల్ పై జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన సమయంలో ఆయన కోసం ఇంటి ముందు వేచి ఉన్న అర్హ, అయాన్ విజువల్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తమ తండ్రి ఇంటికి వచ్చాక ఇద్దరూ హగ్ చేసుకుని ఫుల్ ఖుషీ అయిపోయారు. బన్నీని చూశాక వారి ఆనందం ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. ఇదే సమయంలో ఓ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన జానీ మాస్టర్ కూడా స్పందించారు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల కోసమే.. బన్నీ అరెస్ట్ అయిన వార్త వినగానే తాను ఆలోచించానని జానీ మాస్టర్ తెలిపారు. లైంగిక ఆరోపణల కేసులో కొన్ని రోజుల పాటు జైలులో ఉండి.. బెయిల్ పై బయటకు వచ్చిన జానీ.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మన శత్రువులైనా సరే జైలును చూడకూడదని, జైలు ముఖం కూడా జానీ మాస్టర్ అన్నారు. బన్నీ అరెస్ట్ అయ్యాక వచ్చిన అనేక మీమ్స్ చూశానని, తాను హ్యాపీ అని చాలా మంది పెట్టారని తెలిపారు. కానీ నిజానికి ఆ వార్త విన్నప్పుడు ఫస్ట్ తనకు గుర్తొచ్చింది బన్నీ ఇద్దరు పిల్లలేనని చెప్పి జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. షూటింగ్ టైమ్ లో సెట్స్ కు వచ్చి తన ముందే అయాన్, అర్హ ఆడుకునేవారని చెప్పారు. అందుకే వాళ్లే ముందు తనకు గుర్తొచ్చారని జానీ మాస్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. జానీ మాస్టర్ చెప్పింది నిజమేనని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇదే విషయంపై మరికొంత మంది నెటిజన్లు మండిపడుతున్నారు. సెలబ్రెటీల పిల్లలు మాత్రమే పిల్లలా.. సాధారణ ప్రజల పిల్లలు పిల్లలు కారా అని అంటున్నారు. కిమ్స్ హాస్పటల్‌లో శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నాడు. తల్లిని కోల్పోయిన విషయం కూడా ఆ బాబుకి తెలియదు.“ శ్రీతేజ్ అక్క ఇటీవలె జరిగిన ఇంటర్వ్యూలో అమ్మ ఎక్కడుంది అంటే ఊరు వెళ్ళింది.. ఇక రాదట అని“ ఆ చిన్నారి చెబుతున్న మాటలు వింటుంటే గుండె తరుక్కుపోయింది. “ మరి ఇలాంటి మాటలు, ఆ కుటుంబం వేధన ఇప్పుడు అదే సినీ సెలబ్రెటీలకు కనిపించదా.. ఇప్పుడు ఆ పిల్లలు గుర్తుకురావడం లేదా. వీళ్ళ పిల్లలు మాత్రమే పిల్లలా వీళ్ళేమైనా పైనుంచి పుట్టుకొచ్చారా“ అని కొంత మంది నెటిజన్లు మండిపడుతున్నారు.