Friday, January 10, 2025

మీ సమాధానం ఏమిటి..?

ఎట్టకేలకు మాజీ మంత్రి కేటీఆర్.. ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. నిన్న (బుధవారం) ఆర్వింద్ కుమార్‌ ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ను ప్రశ్నిస్తున్నారు. స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది.. వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది.. పురపాలక శాఖను ఎందుకు రెండో ఒప్పందంలోకి లాగారు.. హెచ్ఎండీఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాలని ఆదేశించారు.. ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదనే విషయం తెలియదా.. అనే కోణంలో కేటీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఒక మంత్రిగా ప్రభుత్వ ధనాన్ని కాపాడాల్సింది పోయి విదేశీ కంపెనీలో ఒప్పందం ఎలా చేసుకున్నారు.. నిబంధనల ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఎందుకు నివారించలేకపోయారు… అన్న విషయాలపై అర్వింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ కేటీఆర్‌ను ప్రశ్నించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ ప్రశ్నలతోనే ఏసీబీ విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. కాగా కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు గంటకుపైగానే విచారిస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు కేటీఆర్‌ను విచారణ జరిపి ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేయనున్నారు. మరోవైపు న్యాయవాది సమక్షంలో విచారణ జరిగేలా బుధవారం హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంటే కేటీఆర్ విచారణ గదిలో ఉంటే.. ఆయన తరఫు న్యాయవాది లైబ్రరీలో కూర్చునే విధంగా ఏసీబీ అధికారులు ఏర్పాటు చేశారు. కనిపించేంత దూరంలో మాత్రమే న్యాయవాది ఉండాలనే అంశాన్ని న్యాయస్థానం స్పష్టం చేసింది.
మరోవైపు నిన్న (బుధవారం) అర్వింద్ కుమార్‌ను ఏసీబీ అధికారులు దాదాపు ఆరున్నర గంటలపాటు విచారణ జరిపిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్.. ఇందులో ఫిర్యాదుదారుడిగా ఉన్న దానకిషోర్ స్టేట్‌మెంట్.. ఈ రెండు స్టేట్‌మెంట్‌లను ఆధారంగా చేసుకుని అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ ఫార్ములా కారు రేసులో దాదాపు రూ. 55 కోట్లు విదేశీ కంపెనీ ఎఫ్ఈవోకు బదిలీ జరిగిందో వాటిపైనే ఎక్కువగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి జమ చేసే సమయంలో నిబంధనలను కేటీఆర్ ఉల్లంఘించారు. ముఖ్యంగా కేబినెట్ అనుమతి లేకుండా నగదు బదిలీ చేయడం.. అలాగే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, ఆర్థికశాఖకు సమాచారం ఇవ్వకుండా హెచ్ఎండీఏ నుంచి రూ. 55 కోట్లు రిలీజ్ చేశారు. ఇదంతా కేవలం కేటీఆర్ ఆదేశాలతోనే జరిగిందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌‌ను శుక్రవారం విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈనెల 15న సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. 15వ తేదీన విచారణకు లిస్ట్ చేసినందున అదే రోజు విచారిస్తామని సీజే స్పష్టం చేశారు. అప్పటి దాకా కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు… కేటీఆర్‌ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీం కోర్టు సీజేఐ నిరాకరించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com