Wednesday, January 8, 2025

మైక్రోసాఫ్ట్‌ విస్తరిస్తాం

సీఎంతో సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల భేటీ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. తమ వ్యాపారాన్ని విస్తరించాలని చాన్నాళ్లుగా మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో 25 ఎకరాల భూమిని కోనుగోలు చేసింది. స్టాప్ డ్యూటీ చెల్లించిన తర్వాత ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనికి సంబంధించిన లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్ వ్యాపారాన్ని విస్తరించాలని చాన్నాళ్ల కిందట ప్లాన్ చేసింది ఆ కంపెనీ. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య‌ నాదెళ్ల హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశాన్ని గేమ్ ఛేంజర్‌గా భావిస్తోంది ఐటీ ఇండస్ట్రీ. ప్రపంచంలో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ కావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన సత్య నాదెళ్ల… ఇండియాకు వచ్చిన ప్రతీసారీ హైదరాబాద్‌ విజిట్ చేస్తున్నారు. ఇక వ్యాపారాల విషయానికొస్తే.. భారత్‌లో పూణె, ముంబై, చెన్నై నగరాల తర్వాత డేటా సెంటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ వంతైంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com