Thursday, November 28, 2024

మధ్యాహ్న భోజనంపై కేంద్రం కీలక నిర్ణయం

సర్కారుబడుల్లో మధ్యాహ్న భోజన పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భోజన పథకం ధరలను పెంచుతూ భుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చ‌దివే ఒక్కో విద్యార్థికి రూ. 5.45 చొప్పున ఖర్చు చేస్తుండ‌గా దానిని రూ. 6.19కి పెంచింది. అదే విధంగా ఉన్న‌త పాఠ‌శాల‌ల్లో చ‌దివే ఒక్కో విద్యార్థికి రోజుకు రూ. 8.17 చొప్పున చెల్లిస్తుండ‌గా దానిని రూ. 9.29కి పెంచింది. ఈ ఖ‌ర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరిస్తాయి. ఈ మేర‌కు ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేస్తూ విద్యా మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. డిసెంబరు 1 నుంచి ఈ ధరలు అమలు చేయాలని అధికారులను సూచించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular