టీఎస్, న్యూస్: ఏపీలో జరుగుతున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాపాడుతున్న సెక్యూలర్ నాయకుడని (Secular leader) పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జగన్‌కు తమ మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశవాది అని ఆరోపించారు. విశ్వసనీయత లేని రాజకీయ నాయకుడని విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో, ముస్లిం జనాభా పెరుగుదలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏపీలో ఎన్డీయే అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను తొలగించేందుకు వెనుకాడబోదని ఆరోపించారు.