Wednesday, January 22, 2025

బాబు మైండ్‌గేమ్‌

– జనసేనను పక్కన పెట్టే ప్లాన్‌?
– తెరపైకి లోకేష్‌

ఏపీ రాజకీయాల్లో విపత్కర పరిస్థితుల్లో కూటమి గెలిచింది. అధికార పీఠంపై కొలువు దీరింది. అయితే ఇంకా వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏమీ కూడా అమలు కాలేదు. మరోవైపు నిత్యవసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఉపాధి అవకాశాలు పెద్దగా లేవు. ఇలా ఎన్నో సమస్యలు ఉంటే.. వాటి గురించి పట్టించుకోకుండా. నిమ్మకు నీరెత్తినట్లు ఉంది ఏపీ మంత్రుల వ్యహారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలు గురించి మాట్లాడని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలూ.. మంత్రి నారా లోకేష్‌ని అర్జెంటుగా ఏపీ డిప్యూటీ సీఎం చేసేయాలని తాపత్రయ పడుతున్నారు. వారి ఈ అతి ఆలోచన.. పార్టీకే బ్యాడ్ నేమ్ తెస్తోంది. డిప్యూటీ సీఎం అంశంలో ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై టీడీపీ, జనసేనతో పాటుగా వైసీపీ కూడా ఈ అంశంపై ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఆలోచిస్తుంది. ఎప్పుడైనా సరే మన ప్రత్యర్ధులకి మనం ఎక్కడ బలహీన పడతామా అని చూడడం అనేది చాలా సహజం. మరి అదే విధంగా వైసీపీ ప్రభుత్వం కూడా కూటమి వైపు అదే విధంగా కాసుకుని కూర్చుంది.

పార్టీపై విధేయతను చాటుకోవడానికి ఆరాటపడుతున్న టీడీపీ నేతలు.. లేనిపోని కొత్త వివాదాలకు తెర తీస్తున్నారు. తాజాగా మంత్రి టీజీ భరత్ మరో అడుగు ముందుకేసి.. జ్యురిచ్ పర్యటనలో.. నెక్స్‌ట్‌ సీఎం లోకేష్ అని అన్నారు. “ఎవరికి నచ్చినా, నచ్చక పోయినా పార్టీ భవిష్యత్తు నాయకుడు, భవిష్యత్తులో కాబోయే సీఎం లోకేశ్‌” అని అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మనం వచ్చిన పనేంటి.. మీరు మాట్లాడుతున్నదేంటి.. అని ఫైర్ అయ్యారు. “భవిష్యత్తులో లోకేశ్‌ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా? దావోస్‌ వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికిగానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదుగా?” అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

ఇకపోతే ఇదే విషయంపై ఓ పక్క చంద్రబాబు ఫైర్‌ అయినట్లు కనిపిస్తూనే నా తరువాత నా వారసత్వమే రావాలనే ఆలోచన ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఏపీలో ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ సీఎం అనే పదవి లేదు. అయినా.. జనసేన పార్టీకి అసెంబ్లీలో 21 సీట్లు ఉండటం, కూటమిలో ఆ పార్టీ భాగస్వామిగా ఉండటంతో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే.. సీఎం తర్వాతి స్థానం పవన్ కళ్యాణ్‌దే. మరి మధ్యలో లోకేష్ భజన ఎందుకు వస్తోందన్నది టీడీపీ చెప్పాలి. లోకేష్‌ని డిప్యూటీ సీఎం చెయ్యడం అంటే.. పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించడం కాదా? ఈ మాత్రం ఆలోచన టీడీపీ నేతలకు లేదా?

టీడీపీ నేతలు ఇలాగే చేస్తూ ఉంటే.. కచ్చితంగా జనసేన కూడా యాక్షన్ మొదలుపెట్టగలదు. ఆల్రెడీ ఇప్పటికే ఆ పార్టీ.. వీలైనప్పుడల్లా.. టీడీపీకి దూరం జరుగుతోంది. టీడీపీ తప్పులతో తమకు సంబంధం లేదని సైడ్ అవుతోంది. తిరుపతి తొక్కిసలాట లాంటి ఘటనల్లో కూడా.. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పడం ద్వారా.. టీడీపీ నేతలు క్షమాపణ చెప్పట్లేదనే సంకేతాలు ఇచ్చారు. ఇలా జనసేన తన జాగ్రత్తల్లో తాను ఉన్నప్పుడు.. టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. అది కూటమి స్నేహానికే ఓ రకమైన సమస్య అని చెప్పవచ్చు. ఇకపోతే చంద్రబాబు ఓ రకంగా చెప్పాలంటే ఇలాంటి మైండ్‌ గేమ్స్‌ ఆడడంలో బాగా ఆరితేరిపోయారు. 45ఏళ్ళ రాజకీయ చరిత్రలో బాబు ఇలాంటివి ఎన్ని చూసి.. ఎన్ని చేసుండరు చెప్పండి. ఇవన్నీ కూడా బాబుకి ఓరకంగా వెన్నతో పెట్టిన విద్యలాంటివి.

ఇలాంటి మైండ్‌ గేమ్‌ ఆడి జనసైనికులను పక్కన పెట్టాలనే ఆలోచన బాబు మైండ్‌లో తిరుగుతుందని కొందరి ఆలోచన. జనసేన తక్కువ ఓట్లతో గెలిచిందనే ఫీలింగ్‌లో బాబు ఉన్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్‌కళ్యణ్‌, నాదెండ్ల మనోహర్‌, కందుల సురేష్‌ ఏపీ క్యాబినెట్‌లో కూటమిలో జనసేన్‌ తరుపున ఉన్న మంత్రులు ఈ నేపథ్యంలో నాగబాబుని కూడా మంత్రి వర్గంలోకి తీసుకునే ఆలోచన ఉన్నట్లు లీకులు ఇచ్చారు. జనసేననే పక్కనపెట్టే ఆలోచన ఉన్నప్పుడు ఇక ప్రస్తుతం మిగతా మంత్రులు పదవుల గురించి ఏమి ఆలోచిస్తారు.

ఇక ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఒక్కరూ ఏ నాడూ యాక్టివ్‌గా ఉన్నది లేదు. జగన్ పుణ్యమా అని డిప్యూటీ సీఎం అనే పదవికి విలువే లేకుండా పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్.. ఉత్తుత్తి డిప్యూటీ సీఎం కాదు. ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. 6 శాఖలకు మంత్రిగా, జనసేన అధినేతగా, డిప్యూటీ సీఎంగా అన్ని పదవుల్లోనూ ఆయన యాక్టివ్‌గా పనిచేస్తూ పోతున్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఎలా కృషి చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్, జనసేనకు ఇబ్బంది కలిగించేవే.

మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతల నుంచి మొదట డిమాండ్లు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలంటూ జనసేన శ్రేణులు కూడా డిమాండ్లు మొదలెట్టాయి. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్న సమయంలో.. టీడీపీ అధిష్టానం వీటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. బాబు మైండ్‌ గేమ్‌ కి మొత్తానికి ఫుల్‌ స్టాప్‌ పడింది.

 

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com