Saturday, September 21, 2024

ఖజానా నింపుతున్న ‘ఖనిజాలు’

సహజ వనరుల అన్వేషణలో మైన్స్ అండ్ జియాలజీ

సహజ వనరుల అన్వేషణలో మైన్స్ అండ్ జియాలజీ శాఖ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలోనే ‘ఖనిజాల’ తవ్వకాలతో ఈ సంస్థ ఖజానాకు భారీగా ఆదాయం చేకూరుతోంది. ఖనిజ వనరుల అభివృద్ధి, వాటి గుర్తింపుతో పాటు వాటిని ఖనిజాలను వెలికితీయడంతో మైన్స్ అండ్ జియాలజీ శాఖ పక్కా ప్రణాళికలతో ముందుకెళుతోంది. తెలంగాణలోని పలు మేజర్, మైనర్ ఖనిజాల వెలికితీతతో మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఆదాయాన్ని పెంచుకుంటోంది.

ఖనిజ వనరుల అభివృద్ధి ఇలా…

నల్ల బంగారాన్ని ఇప్పటికే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌తో కలిసి ఈ సంస్థ తవ్వకాలు చేపట్టింది. ఇక మిగతా జిల్లాలోనూ ఐరన్, లైమ్‌స్టోన్, కోల్ తవ్వకాలకు సంబంధించి వివిధ సంస్థలకు కాంట్రాక్టును మైన్స్ అండ్ జియాలజీ శాఖ పలు సంస్థలకు అప్పగించింది. ఇలా 14 జిల్లాలో తమ సంస్థ ద్వారా ఖనిజాల వెలికితీతకు ఆ సంస్థ ప్రణాళికలను చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్‌లో మాగ్నీస్ ఓర్, భదాద్రి కొత్తగూడెంలో గ్రానైట్, కోల్, జగిత్యాలలో ఐరన్ ఓర్, లైమ్‌స్టోన్, జయశంకర్ భూపాలపల్లిలో కోల్, ఐరన్ ఓర్, స్టోయింగ్ శాండ్, జోగులాంభ గద్వాల్‌లో లైమ్‌స్టోన్, ఖమ్మంలో కోల్, ఐరన్ ఓర్, కుమురం భీంలో లైమ్‌స్టోన్, కోల్, మహబూబాబాద్‌లో ఐరన్ ఓర్, మహబూబ్‌నగర్‌లో గోల్డ్, డైమండ్, మంచిర్యా లలో లైమ్‌స్టోన్, కోల్, స్టోయింగ్ శాండ్, నల్లగొండలో లైమ్‌స్టోన్, గోల్డ్, డైమండ్, పెద్దపల్లిలో లైమ్‌స్టోన్, కోల్, ఐరన్ ఓర్, స్టోయింగ్ శాండ్, సూర్యాపేటలో లైమ్‌స్టోన్, గోల్డ్, డైమండ్, వికారాబాద్‌లో లైమ్‌స్టోన్, వనపర్తిలో లైమ్‌స్టోన్‌ను ఈ సంస్థ గుర్తించడంతో పాటు పలు సంస్థలకు వాటి కాంట్రాక్టును అప్పగించింది.

పలు జిల్లాలో సున్నపురాయి నిక్షేపాల వెలికితీత

బయ్యారం రిజర్వ్ ఫారెస్ట్‌లో మీడియం గ్రేడ్ ఐరన్ ఓర్ నిక్షేపాలు, ఖమ్మం జిల్లాలోని రెవెన్యూ, పట్టా భూముల్లో ఫ్లోట్ ఐరన్ ఓర్ నిక్షేపాలు, కరీంనగర్ జిల్లాలోని ఇనుప ఖనిజం నిక్షేపాలను ఈ సంస్థ గుర్తించింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో ఊహించిన విధంగా స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం ఖనిజ నిల్వలను అంచనా వేయడానికి రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిక్షేపాలు జిఎస్‌ఐ, డిఎం అండ్ జి, ఎస్‌సిసిఎల్ ద్వారా వాటిని గుర్తించడానికి ఈ సంస్థ చర్యలు చేపట్టింది. నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, పెద్దపల్లి, మంచిర్యాలు, కొమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో సున్నపురాయి నిక్షేపాల వెలికితీ తకు సంబంధించి పలు సంస్థలకు ఈ సంస్థ కాంట్రాక్టును అప్పగించింది. ఖమ్మం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి- భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మైకా, డోలరైట్ , గ్రానైట్‌లు ఎక్కువగా లభిస్తుండడంతో ఈ సంస్థకు ఆదాయం అంతకంతకు పెరుగుతోంది.

మేజర్ ఖనిజాల ద్వారా 5 సంవత్సరాల్లో రూ.12,430 కోట్ల ఆదాయం

మేజర్ ఖనిజాల ద్వారా ఈ సంస్థకు 2019 నుంచి 2023 (5 సంవత్సరాల్లో) వరకు రూ.12,430 కోట్ల ఆదాయం సమకూరగా, మైనర్ ఖనిజాల ద్వారా రూ.6,476.76 కోట్ల ఆదాయం మైన్స్ అండ్ జియాలజీ శాఖకు వచ్చింది. అయితే పెద్ద తరహా ఖనిజాల వెలికితీత, కాంట్రాక్టు అప్పగించడం ద్వారా 2019, 20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,806.26 కోట్లు రాగా, 2020,21 సంవత్సరంలో రూ.1,620.12 కోట్లు, 2021,22 సంవత్సరంలో రూ.495.70 కోట్లు, 2022,23 సంవత్సరంలో రూ.5,366.30 కోట్లు, 2023,24 సంవత్సరంలో రూ.3112.65 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక చిన్న తరహా ఖనిజాల వెలికితీతకు సంబంధించి 2019, 20 ఆర్థిక సంవత్సరంలో రూ.1010.71కోట్లు రాగా, 2020,21 సంవత్సరంలో రూ.1,208.74 కోట్లు, 2021,22 సంవత్సరంలో రూ.1083.75 కోట్లు, 2022,23 సంవత్సరంలో రూ.1581.91 కోట్లు, 2023,24 సంవత్సరంలో రూ.1591.65 కోట్ల ఆదాయం మైన్స్ అండ్ జియాలజీ శాఖకు వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular