Friday, May 16, 2025

సంగారెడ్డి ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి దామోదర

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ను ఆవిష్కరించిన రాష్ట్ర వైద్య ,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి అమరవీరుల స్థూపానికి పూల గుచ్చాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం, జిల్లా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు స్వాతంత్ర సమరయోధులందరికీ జోహార్లు అర్పించారు.
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో చేరి నేటికీ 77 వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక , విద్యార్థినీ, విద్యార్థులకు, జిల్లా ప్రజలకు  మంత్రి దామోదర్ రాజనర్సింహ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com