Saturday, September 14, 2024

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు

  • తొమ్మిదన్నరేళ్ల పాటు నియామకాలు లేకే నిరుద్యోగులుగా మిగిలారు
  • విపక్ష నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి
  • మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

యువత, నిరుద్యోగుల ప్రయోజనార్థం రాష్ట్రంలో ప్రకటించిన మేరకు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తెలిపారు. పరీక్షలు వాయిదా వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే వాయిదా వేస్తే న్యాయ పరమైన, సాంకేతిక పరమైన చిక్కులు ఎదుర్కొక తప్పదని వెల్లడించారు. ఆదివారం మంత్రి సీతక్క ప్రకటన జారీ చేశారు. వాయిదా వేయడం వల్ల నిరుద్యోగులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. నిరుద్యోగులు వమో పరిమితి దాటిపోయి ఉద్యోగాలకు అర్హులు కాకుండా పోతారని వివరించారు. అందుకే వారి ఆకాంక్షల మేరకు షెడ్యుల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పరీక్షలు వాయిదా వేయాలని కొంత మంది నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్న ఆందోళన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్టిలో పరీక్షలను నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొందని ఆ ప్రకటనలో వివరణ ఇచ్చారు.

ఉద్యోగ నియామకాలపై గత ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని, ఆ నిర్లక్షపు నీడలు ఇప్పటికీ నిరుద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయని అందుకే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటి పరీక్షలను వాయిదా వేయాలని కొందరు కోరుతున్నారని విమర్శించరు. నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. గత పది సంవత్సరాల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు లేక లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న నిరుద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో నియామకాలను పట్టించుకోకపోవడం వల్ల ఎన్నో శాఖల్లో ఖాళీలు పేరుకుపోయాయని, దీని ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగక ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తగిన సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు లేక విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

అందుకే యుద్ద ప్రాతిపదికన నియామకాలను చేపట్టి ప్రజలకు సకాలంలో సేవలందించాలన్న పట్టుదలతోనే గ్రూప్ పరీక్షల నోటిఫికేషన్లతో పాటు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఇంతటితో పోటి పరీక్షలు అయిపోయినట్లు కాదని, ఈ అవకాశం పోతే మరో అవకాశం లేనట్లు కాదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ప్రతి ఏటా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు. యూపీఎస్సీ తరహాలో ఏటా షెడ్యుల్ ప్రకారం పోటీ పరీక్షలు జరుగుతాయని, ఇప్పుడు అవకాశాలు దక్కని వారు జాబ్ క్యాలెండర్ ద్వారా విడుదలయ్యే నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవచ్చునని వెల్లడించారు.

అలా కాకుండా ప్రస్తుత పరీక్షలను తమ ప్రిపరేషన్ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలనీ కొందరు కోరడం సహేతుకం కాదని సూచించారు. అధికారం కోల్పోయి రాజకీయ నిరుద్యోగులుగా మారిన కొందరు, పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. నియామకాలు లేక తొమ్మిదన్నరేండ్ల విలువైన సమయాన్ని విద్యార్ధి నిరుద్యోగులు కోల్పోయారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ తొమ్మిదన్నరేండ్ల పాలనలో ఒక్క గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించ లేదని, ఏటా ఉండాల్సిన డీఎస్సీ ఏడేండ్లుగా లేదని అన్నారు. ఉద్యోగ నోటిఫికెషన్లు, నియామకాలు లేక వందలాది నిరుద్యోగులు ఉరిపోసుకున్నారని గుర్తు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular