Saturday, January 4, 2025

కెటిఆర్‌ను ఓ రెండ్రోజులు ఎంజాయ్‌ ‌చేయనీయండి

  • కొత్త సంవత్సరం రోజు ఆయ‌న్ను బాధ పెట్టకండి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆసక్తికర వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ‌రెండు రోజులు ఎంజాయ్‌ ‌చేయనివ్వండి అని అన్నారు. కొత్త సంవత్సరం రోజు కేటీఆర్‌ను బాధ పెట్టకండని చెప్పారు. న్యూ ఇయర్‌ ‌రోజు ఎంజాయ్‌ ‌చేయనీయాలని అన్నారు. కేటీఆర్‌ ‌గురించి 3, 4వ తేదీల్లో చూద్దామని కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి షాకింగ్‌ ‌కామెంట్స్ ‌చేశారు. జలసౌధలో మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంట్ పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

నల్ల‌గొండ ప్రజల దశాబ్దాల కల ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని హెచ్చరించారు. కాంట్రాక్టర్‌ ‌పని చేయకపోతే సంబంధిత మంత్రికి చెప్పాలన్నారు. దయచేసి అధికారులు కంటితుడుపు పనులు చేసే ప్రయత్నం చేయొద్దని వార్నింగ్‌ ఇచ్చారు. అధికారులు సీరియస్‌గా పని చేస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ ‌పూర్తి చేయొచ్చని చెప్పారు. నల్గొండను రాబోయే నాలుగేళ్లలో ఉభయ గోదావరి జిల్లాలను మించి సస్య శ్యామలం చేస్తామని అన్నారు. ఆంధ్ర పాలకులే నల్గొండకు న్యాయం చేశారని చెప్పారు. పదేళ్లు నల్గొండ జిల్లాకు బీఆర్‌ఎస్‌ అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి ఫామ్‌ ‌హౌస్‌కు, ప్రగతి భవన్‌కు మంత్రిగా పనిచేశారని విమర్శించారు. ఆయనకు రోడ్ల గురించి ఏం తెలుసు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com