మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. తన అనుచరులను అరెస్ట్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ లో ఆమె సీఐ సీటులో కూర్చుని మరీ పోలీసులపై ఫైరయ్యారు. మంత్రి కొండా సురేఖ, రేవూరి ప్రకాష్ రెడ్డి కార్యకర్తల మధ్య జరిగిన వివాదంపై మంత్రి ఆరా తీస్తున్నారు.
కాగా వరంగల్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇరు వర్గీయుల మధ్య ప్లెక్సీ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ధర్మారంలో మంత్రి కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో రేవూరి ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు వాటిని చింపివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు కొండా సురేఖ వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మంత్రి కొండా సురేఖ ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆమె వర్గీయులు అక్కడికి భారీ స్థాయిలో చేరుకున్నారు. తన వర్గం కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆరాతీస్తున్నారు మంత్రి సురేఖ.