Wednesday, January 8, 2025

గల్ఫ్ లో చిక్కుకున్న కదిరి మహిళకు అండగా నిలిచిన మంత్రి లోకేష్

ఖతర్ నుంచి క్షేమంగా స్వస్థలానికి చేరిన షేక్ రషీద

అమరావతి: ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ అన్ని విధాల అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. తమ సమస్యలను, కష్టాన్ని తెలియజేసిన వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారు. ఉపాధి కోసం ఖతర్ దేశానికి వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన షేక్ రషీదను రక్షించి, క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరారు. బతుకుదెరువు కోసం ఖతర్ వచ్చిన తనను యజమాని అనేక చిత్రహింసలు పెడుతున్నాడని, కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

స్వదేశానికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ క్యాన్సిల్ చేశారని, పాస్ పోర్ట్ కూడా లాక్కున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. తనను ఎలాగైనా రక్షించి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ ను వేడుకున్నారు. తక్షణమే స్పందించిన మంత్రి.. తన టీం ద్వారా రషీదను స్వదేశానికి రప్పించారు. సాయం అడిగిన వెంటనే స్పందించి స్వదేశానికి చేరేలా చొరవ చూపిన మంత్రి లోకేష్ కు రషీద ధన్యవాదాలు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com