Saturday, April 5, 2025

Nvidia Summit 2024 ఎన్ విడియా సిఇఓ జెన్సస్ హువాంగ్ తో మంత్రి లోకేష్ భేటీ

ఎఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి

ముంబాయి: ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్ విడియా సిఇఓ జెన్సన్ హువాంగ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ముంబాయిలో భేటీ అయ్యారు. ఎపి పాలనావ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవలకు ఎఐ టెక్నాలజీని వినియోగించాలన్నది మా అభిమతం. అమరావతిలో ఏర్పాటుచేయబోయే ఎఐ యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు.

ఇందుకు సానుకూలంగా స్పందించిన హువాంగ్ రాబోయేరోజుల్లో ఎఐ టెక్నాలజీ ద్వారా అంతర్జాతీయంగా ఎటువంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయో వివరించారు. స్పీచ్ రికగ్నిషిషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ సంస్థల్లో ఎఐ వినియోగానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ టూల్స్, అల్గారిథమ్ లను ఎన్ విడియో అందిస్తోంది. ఇటీవల బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్ విడియా 3.5 ట్రిలియన్ల మార్కెట్ విలువ కలిగి ఉండగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సిఇఓ అయిన జెన్సన్ హువాంగ్‌ ప్రపంచంలో 11వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com