వైసీపీ దాష్టీకాలపై పోరాడిన టిడిపి ఫ్యామిలీకి అండగా నిలిచిన మంత్రి లోకేష్
పేద కుటుంబం. కానీ తెలుగుదేశం పార్టీని అభిమానించడంలో పెద్ద కుటుంబం. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ దాష్టీకాలను పసుపు జెండాని అండగా చేసుకుని మరీ ఎదిరించారు. వారే గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం, కోనంకి తాండాకి చెందిన బాణావత్ లక్ష్మీదేవి భాయ్, వెంకటేశ్వర్లు నాయక్‌లు. నాటి అధికార వైసీపీ ముష్కరులు వేధించినా తొణకక, బెణకక వీరి పన్నెండేళ్ల కొడుకు ఇంటిపై తెలుగుదేశం జెండా ఎగురవేశాడు. ఇది చూసి తట్టుకోలేని జగన్ సైకో సైన్యం ఆ పిల్లాడి నోట్లో పురుగుమందు పోసి చంపేయాలని చూశారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న కొడుకుని ఆ తల్లిదండ్రులు వైద్యం చేయించి దక్కించుకున్నారు. కేసుపెట్టినా నాటి పోలీసులు పట్టించుకోలేదు.
తన కొడుకు తమ ఇంటిపై కట్టిన చోటే ఆ తల్లి బాణావత్ లక్ష్మీదేవి భాయ్ తెలుగుదేశం జెండాని మళ్లీ ఎగురవేసింది. వైసీపీ సైకోలు మళ్లీ దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం జెండాని గుండెల నిండా నింపుకుని పార్టీ కోసం పనిచేస్తున్న కుటుంబం ఇటీవల టిడిపి కేంద్ర కార్యాలయానికి వచ్చి తమ దుస్థితిని వివరించారు. ఈ సమాచారం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని తెలుగుదేశం పార్టీ కోసం చూపించిన తెగువని అభినందించారు. ఆర్థిక సాయం అందించి, అండగా టిడిపి ఉంటుందని భరోసా ఇచ్చారు.