ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతం అయ్యేలా లోకేష్ చర్యలు.యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుండి 200 క్యూసెక్కుల కు తగ్గిన సీపేజ్ లీకేజ్. పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్.
మంత్రి లోకేష్ ఆదేశాలతో లీకేజ్ అరికట్టేందుకు జియో మెంబ్రేన్ షీట్ వినియోగిస్తున్న అధికారులు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో లికేజ్ అరికట్టేందుకు చర్యలు. వస్తున్న వరద ను అంచనా వేస్తూ గండ్లు పూడ్చిన చోట కట్ట ఎత్తు పెంచే పనులు వేగవంతం. ఇప్పటికే గండ్లు పడిన చోట 5.7 మీటర్ల ఎత్తు పెంపు. మరో 0.3 మీటర్ల ఎత్తు పెంచితే ప్రస్తుత కట్ట స్థాయికి పనులు పూర్తి.
ఎప్పటికప్పుడు బుడమేరు వద్ద జరుగుతున్న పనులను డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చెయ్యడానికి వివిధ శాఖల అధికారులతో సంప్రదింపులు చేస్తున్న లోకేష్. మరోపక్క వరద బాధితులకు అందుతున్న సహాయం, నష్ట పరిహార అంచనా పై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి నారా లోకేష్. ఇతర శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నష్ట పరిహార అంచనా పక్కాగా నిర్వహించేందుకు చర్యలు. మొత్తం 36 మంది ప్రజాప్రతినిధులను నష్ట అంచనా పర్యవేక్షణకు నియామకం. ఒక పక్క బాధితులకు సహాయం అందిస్తూనే మరో వైపు నష్ట అంచనా వేగంగా పూర్తి చెయ్యడానికి చర్యలు.