మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో వరద బాధితులకు ముమ్మరంగా కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు. విజయవాడ వరద బాధితుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ఆహారం పంపుతున్న వివిధ సంస్థలు. ఈరోజు ఉదయానికి కృష్ణా బ్యారేజ్ వద్ద భారీగా తగ్గుముఖం పట్టిన వరద.. ప్రస్తుతం ఔట్ ఫ్లో 9,17,976 క్యూసెక్కులు.
నిన్న మధ్యాహ్నం కృష్ణా బ్యారేజి చరిత్రలో అత్యధికంగా 11.47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం. ఐదు హెలికాప్టర్లు, 174 బోట్లు ద్వారా వరద బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్న NDRF, SDRF బృందాలు. భారీ వరదల కారణంగా రాష్ట్రంలో దెబ్బతిన్న రెండు వేల కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రోడ్లు, 25 చోట్ల రోడ్లకు కోతలు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,80,244 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వరదల కారణంగా నిరాశ్రయులైన 43,417 మందిని 163 పునరావాస శిబిరాలకు తరలింపు.. వారికి ఆహారం, తాగునీరు అందజేత. విజయవాడ నగరంలో వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కొనసాగుతున్న ఆహార పంపిణీ కార్యక్రమాలు.