Monday, November 18, 2024

మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు

* మంగళగిరిలో క్లీన్ అండ్ గ్రీన్‌కు మంత్రి నారా లోకేష్ చర్యలు
* సొంతంగా కార్మికులను నియమించి గడ్డి తొలగింపు పనులకు చర్యలు తీసుకున్న మంత్రి నారా లోకేష్
* సొంతంగా 5 గడ్డి తొలగింపు మిషన్ల కొనుగోలు చేయడంతో పాటు ప్రతి నెల కార్మికులకు జీతాలు చెల్లించనున్న మంత్రి
* నియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపుల ఉన్న గడ్డి, పిచ్చుమొక్కలు తొలగింపు
* నేటి నుంచి గడ్డి తొలగింపు కార్యక్రమం…లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికుల హర్షం
మంగళగిరి టౌన్, సెప్టెంబర్ 29: మంగళగిరి నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సొంతంగా  5 గ్రాస్ కటింగ్ మిషన్లు కొనుగోలు చేయడంతో పాటు వాటిని వినియోగించి పిచ్చిమొక్కలు, గడ్డి తొలగించేందుకు ఐదుగురు కార్మికులను నియమించారు. వీరికి అవసరమైన జీతభత్యాలను నారా లోకేష్ సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఒక్కో గ్రాస్ కటింగ్ మిషన్ కొనుగోలుకు రూ.18వేల వరకు ఖర్చు చేశారు. ఆదివారం ఉదయం నుంచే మంగళగిరి పట్టణంలోని పానకాల శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఘాట్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో యంత్రాల సాయంతో గడ్డిని, పిచ్చి మొక్కలను తొలగించారు. ఆయా పనులను టీడీపీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షించారు. మంగళగిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular