ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం :ఇబ్రహీంపట్నంలో వరద ప్రాంతాలను సందర్శించిన మంత్రి నారా లోకేష్.జి కొండూరు మండలంలోని బుడమేరు లాకులను సందర్శించారు మంత్రి నారా లోకేష్….ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ఉదృతంగా ప్రవహించడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
అటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా భవిష్యత్తు కార్యచరణ కోసం ఆయన ఈ పర్యటన సాగించారు…గత రాత్రి కొండపల్లి శాంతినగర్ వద్ద ఎర్ర చెరువు కట్ట తెగడంతో జాతీయ రహదారిపై నీరు ప్రవహించింది….ముందుగా ఎర్రకట్ట చెరువును పరిశీలించిన ఆయన బుడమేరు లాకులను మరియు లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామాలను సందర్శించారు….ఆయన వెంట మాజీ మంత్రి దేవినేని ఉమా … భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు.