Sunday, March 16, 2025

ట్విట్టర్లో జగన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల

అబద్ధాల్లో జగన్ కి ఆస్కార్ అవార్డుఇవ్వచ్చు ……పోలవరం ఎత్తుపై తప్పుడు ప్రచారం మానుకో….

కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని మోసం చేసి జగన్ చిత్కారానికి గురయ్యాడు.

ప్రపంచ చరిత్ర తిరగేస్తే తల్లిని, చెల్లిని మోసం చేసిన వంటి దౌర్భాగ్య రాజకీయవేత్త ఎక్కడా కనిపించడు ఇతను తప్ప.

ప్రజా జీవనంలో ఉండడానికి అర్హత లేదన్న విషయం జగన్కు అర్థం అయిపోయింది .

అందుచేతనే డైవర్షన్ పోలిటిక్స్ కు తెర లేపాడు.

పోలవరం ఎత్తు పై అతని చెత్త మీడియాలో అబద్ధాలు అచ్చు వేసి గడిచిన రెండు రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నాడు . దానికి నేను పూర్తి వివరాలతో జగన్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహం గురించి వివరించా..

అయినా అతని బుద్ధి మారలేదు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమే.

నాడు జల యజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారు. కృష్ణ మిగులు జలాల్లో హక్కు కోరబోమని బ్రిజెష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ రాసి ఇచ్చి ద్రోహం చేశాడు.

పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు ఆలస్యం చేసి డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారుకులయ్యారు.

ఇసుక మాఫియా తో అన్నమయ్య డ్యాం ను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోగొట్టాడు.

పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా….

పోలవరానికి కేంద్రం ఇచ్చిన 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టాడు.

పోలవరం ఎత్తు తగ్గించడానికి రెండు పేజ్ లుగా విభజించింది జగన్ కాదా…

కేంద్రాన్ని 41.15 మీటర్లకు తగ్గించి అనుమతి కోరింది జగన్ కాదా…

మా ఎన్డీఏ ప్రభుత్వం పోలవరం ఎత్తు 45.72 మీటర్లు పెంచి నదుల అనుసంధానం చేసి సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్ గా ఆవిర్భవింప చేస్తాం.

ఇప్పటికైనా అబద్ధాలు మాని నీ కుటుంబ కలహాల్ని చక్కబెట్టుకో ఇది నీ హితువు కోరి చెబుతున్నా….మంత్రి నిమ్మల రామానాయుడు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com