Saturday, February 1, 2025

ఫామ్ హౌస్‌లోనే మాట్లాడతారా?.. లేక  అసెంబ్లీకి వొచ్చేదుందా?

  • ప్ర‌తిప‌క్ష నేత అంటే ప్ర‌జ‌ల్లో ఉండాలి..
  • ఉనికి కోస‌మే తుపాకీ రాముడిలాపిట్ట‌ల దొర మాట‌లు
  • కేసీఆర్ వ్యాఖ్యలపై  ఘాటుగా స్పందించిన మంత్రి పొంగులేటి

అసెంబ్లీ ఎన్నిక‌లు అయిన‌ప్ప‌టి నుంచి ఫామ్ హౌస్‌కే పరిమితమై ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఇప్పుడేదో అంటే సరిపోదని,  ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో తిరగాల‌నిప్రజా సమస్యలు ప్రస్తావించాలని  రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వ‌ర్షాలు వొచ్చినా.. వ‌ర‌ద‌లు వొచ్చినా క‌నీసం ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించ‌లేదనిఫామ్ హౌస్ దాట‌లేద‌ని  అధికారంలో ఉన్ననాడు స‌చివాల‌యానికి రాలేదు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఏడాది నుంచి అసెంబ్లీకి రాలేదు. ప్ర‌జ‌ల్లోకి రాలేదు.. కేసీఆర్ జీవితమంతా ఫామ్ హౌసే అంటూ మండిప‌డ్డారు. తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు. ప్ర‌జ‌లు అత్యాశ‌కు పోయి కాంగ్రెస్ కు వోటేశారని కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్య‌లు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించేలా ఉన్నాయనిప్రజా తీర్పును అగౌరవ పరుస్తున్నారని అన్నారు. ప్ర‌జ‌ల‌న్నా.. ప్ర‌జాతీర్పు అన్నా కేసీఆర్ కు ఏనాడూ గౌర‌వం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేవారు.

ప‌దేండ్లు అధికారం ఇచ్చిన ప్ర‌జ‌ల‌కు ఓడిపోయిన త‌ర్వాత ఈ రోజు వ‌ర‌కు కూడా కనీసం కృత‌జ్ఞ‌త తెల‌ప‌లేదు. ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తున్నామ‌ని కూడా ప్ర‌క‌టించ‌లేదు. ఈ ఏడాది కాలంలో న‌ల్గొండక‌రీంన‌గ‌ర్ బీఆర్ఎస్ స‌భ‌ల్లో కూడా.. ఈరోజు మాదిరిగానే గంభీర ప్ర‌క‌ట‌న‌లే చేశారు. ఆ త‌ర్వాత ఏమ‌య్యారో అందరికీ తెలిసిందే.. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా అసెంబ్లీ ముఖం చూడ‌ని వ్య‌క్తి త‌న ఉనికిని చాటుకోవ‌డానికినేనున్నాన‌ని చెప్పుకోవ‌డానికి తుపాకీ రాముడిలాపిట్ట‌ల దొర మాదిరి మాట్లాడుతున్నారు. ప్రజలు ఏదో నమ్మి వోటేశారని అంటున్నాడ‌నికానీ  వాస్తవాలు గ్రహించి మీ గడీల పాలన వొద్దనుకుని ప్రజలు మిమ్మ‌ల్ని మీకుటుంబాన్ని చీత్కరించార‌ని అన్నారు. పథకాలు అమలు కాలేదని ఫామ్ హౌస్‌లో కూర్చొని మాట్లాడటం కాదు. ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలనే మేమంటున్నాం. అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి  పదే పదే ఆహ్వానించారు. 80 వేల పుస్తకాలు చదివినారన్నారు.

మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వాలని అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు రాలేదని ప్ర‌శ్నించారు.   2020 రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శమని ప్రకటించిన మీరు భూ భారతి చట్టం ప్రవేశ పెట్టిన నాడైనా అస్సెంబ్లీ కి వొస్తారని ఆశించాం. మీ ఫామ్ హౌస్‌కు కరెంటు కోతలెక్కడివి. లెక్కలు తీద్దామా. ఏ రోజు ఎంత కరెంటు సరఫరా అయింది. ఎంత సరఫరా అవుతుంది. నీ ఫామ్ హౌస్‌కు నీళ్లెక్కడివి.  రైతు భరోసా ఇచ్చిందే మేము. రాష్ట్రంలో ఉచిత కరెంట్ తెచ్చిందే కాంగ్రెస్. చరిత్ర ప్రజలకు తెలియదా. నీవంటున్న గురుకులాలను సందర్శిద్దామా. మాతో వస్తారా. నీవెక్కడికంటే అక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం.  అద్దె గదుల్లో పెట్టి విద్యార్థులను నానా ఇబ్బందులకు గురిచేసిన మీరా మాట్లాడేది.  రైతుల రుణమాఫీ కోసం 20 వేల కోట్ల రూపాయలు ఇచ్చిన సంగతి కళ్లకు కనిపించడం లేదా. అభివృద్ధి మీద చర్చకు సిద్ధమాఅని మంత్రి పొంగులేటి స‌వాల్ విసిరారు.  ఏదైనా మాట్లాడితే దానికొక ప్రాతిపదిక ఉండాల‌నిముస్లింలను కాంగ్రెస్ వాడుకుందని ఆరోపించార‌నికానీ నిజానికి వాడుకుని వదిలేసే చరిత్ర బిఆర్ఎస్‌ద‌ని మండిప‌డ్డారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com