మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డకి స్వల్ప గాయమైంది. తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మున్నేరు పరివాహక ప్రాంతంలోని నాయుడుపేట, జలగం నగర్ దానవాయిగూడెం ల్లో వరద ఉధృతి కారణంగా కాలనీలు అన్ని నీట మునగడంతో మంత్రి బైక్ పై తిరుగుతూ పర్యటించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ కింద పడి గేర్ రాడ్ గుచ్చకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.
వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంత్రికి చికిత్స అందించారు. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంకు చేరుకోనున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయలుదేరారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. భారీ వర్షాలతో ఆ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.