Friday, November 8, 2024

కులగణన సర్వేకు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలి

ప్రతి తెలంగాణ బిడ్డ ఈ సర్వేలో భాగస్వాములు కావాలి
నవంబర్ 30వ తేదీ లోపు ఈ సమాచార సేకరణ పూర్తి
చేయడానికి కసరత్తు చేస్తున్నాం
రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుంచి చేపట్టబోయే ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే) కులగణన సర్వేకు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా రాహుల్ గాంధీ మాట ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో జరుగనున్న ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ సర్వే రాబోయే కాలంలో అన్ని రకాల పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు ఒక మెగా హెల్త్ చెకప్ మాదిరిగా ఉపయోగపడుతుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సర్వేలో సమాచారం సేకరిస్తున్న వారు, సమాచారం తెలిపే వారు ప్రతి తెలంగాణ బిడ్డ ఈ సర్వేలో భాగస్వాములు కావాలని మంత్రి పొన్నం కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖను రాశారు.

85 వేల మంది ఎన్యూమరేటర్లు..
నవంబర్ 6వ తేదీ నుంచి 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక అబ్జర్వర్‌గా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల పర్యావేక్షణ ఉంటుందని మంత్రి ఆ లేఖలో తెలిపారు. ఇంటింటి నుంచి సమగ్ర సమాచారం సేకరించి ఆ డేటాను ఎంట్రీ చేయడంతో పాటు నవంబర్ 30వ తేదీ లోపు ఈ సమాచార సేకరణ పూర్తి చేయాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. కులగణన కోసం ప్రభుత్వం ఇప్పటికే జీఓ నెం 199 ద్వారా నిరంజన్ చైర్మన్‌గా రాపోలు జయ ప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మిమెంబర్లుగా బిసి కమిషన్ ను నియమించిందని, రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్ మెంట్‌ను నోడల్ డిపార్ట్ మెంట్ గా ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ పౌరులతో పాటు ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలపై ప్రణాళికలు రచ్చించి వాటిని అమలు చేయడం నిమిత్తం ఈ సర్వే కోసం ఫిబ్రవరిలోనే శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కర్ణాటక సిఎం సిద్దరామయ్య సమక్షంలో కామారెడ్డిలో ప్రకటించిన బిసి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిబ్రవరి 04వ తేదీన తెలంగాణలో ఇంటింటికి సమగ్ర సర్వే చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించిందని ఆయన తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular