Sunday, January 12, 2025

సంక్రాంతి ఛార్జీల దోపిడీని సహించం

ప్రైవేట్‌ ‌ట్రావెల్స్‌కు మంత్రి పొన్నం వార్నింగ్‌
సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించబోమనిబస్సులను సీజ్‌ ‌చేస్తామని ప్రైవేటు బస్సుల యజమానులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హెచ్చరించారు. అదనపు ఛార్జీల పేరిట ప్రయాణికులను దోపిడీకి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనిరెగ్యులర్‌ ‌ఛార్జీలనే వసూలుచేయాలని  ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రైవేటు బస్సుల యజమానులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి.

ఆర్టీసీ అధికారులు రహదారులపైనే ఉండి తనిఖీలు చేపట్టాలి. సంక్రాంతి పండగ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. అవసరమైతే మరిన్నింటిని నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉండాలి‘ అని పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రైవేట్‌ ‌బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ కమిషనర్‌ ‌సురేంద్రమోహన్‌ ఒక ప్రకటనలో హెచ్చరించారు. పర్మిట్‌ ‌నిబంధనలను ఉల్లంఘించినాసరకు రవాణా చేసినా ప్రైవేటు ట్రావెల్స్ ‌బస్సులపై చర్యలు తప్పవు. ఈ విషయమై వారం రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాం. ప్రైవేటు బస్సులపై ఇప్పటికే 150 కేసులు నమోదు చేశాం‘ అని వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com