Wednesday, April 9, 2025

మంత్రి సీతక్క.. మాస్‌ డ్యాన్స్‌

మంత్రి సీతక్క మాస్‌ డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ములుగులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే మంత్రి సీతక్క డాన్స్ చేయడంతో కార్యక్రమంలో జోష్ కనిపించింది. ఇదిలా ఉంటే, ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుచేస్తే చర్యలు తప్పవని, సస్పెన్షన్​తోపాటు సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామని హెచ్చరించారు. కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని, స్కీముల అమలులో విచక్షణ, మానవత్వం మరవొద్దని చెప్పారు. మంచిర్యాలలో ఓ వృద్ధురాలికి పింఛన్ ఆపడంపై ఫైర్ అయ్యారు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం మీద రుద్దితే కఠినంగా శిక్షిస్తామన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com