- అలాంటి సినిమాలకు అవార్డులా?
- పుష్ప లాంటి సినిమాలతో నేర ప్రవృత్తి
- మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు.. అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవు.. కానీ ఒక స్మగ్లర్ పోలీస్ బట్టలు విప్పి నిలబెట్టిన సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. స్మగ్లర్ హీరో అంటే అదేం సినిమా…? స్మగ్లర్ హీరో.. స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడు..? అని అడిగారు.
సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రజలు స్వాగతిస్తారని రెండు మర్దర్లు చేసిన నేరస్తుడు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా చూస్తూ దొరికాడని, ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని అన్నారు. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందించాలి కోరారు. చంకలో బిడ్డపెట్టుకుని ఒక పేద మహిళపై హక్కులు కోసం పోరాడిన జై భీమ్ సినిమాకు అవార్డు రాలేదని, కానీ సినిమాలను గౌరవించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.