తెలంగాణ రాష్ట్రం వివక్ష నుంచి వికాసం దిశగా పయనిస్తోదంని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క మాట్లాడారు. తెలంగాణ ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘన కీర్తి తెచ్చే విధంగా ఎన్నో రకాల వ్యాపారాల్లో ఎదిగేవిధంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కుటుంబంలో మీరందరూ కూడా భాగస్వాములు. ప్రగతి రథచక్రాలలో ఫ్రీగా ప్రయాణం చేస్తున్నాం. ప్రీగా ప్రయాణమే కాకుండా ఆ రథచ్రకాలకు యజమానులయ్యారు. 600 బస్సులకు మీరు ఓనర్ అయ్యే విధంగా బాధ్యత తీసుకొని, ముందుకొచ్చిన మన ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటివరకు 115 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు మహిళ యాజమాన్యంతో నిర్వహించబోతున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, 21632 కోట్ల రుణాలతో రెండు లక్షల 25 వేల చిన్న మధ్యతరహ పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటిచంఆరు. ఐటి కారిడార్‌లో తొమ్మిది కోట్లతో ఇందిర మహిళా శక్తి కూడా అవకాశం కల్పించామని చెప్పారు.
ఇలా మహిళా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంటే… కొంతమంది ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్నటిదాకా మహిళలంటే ఒక వంటగదికే పరిమితం అయితే… ఈ రోజు మహిళా ఫ్రీ బస్సు ఎక్కితే నచ్చడంలేదు. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తుంటే నచ్చడం లేదు. విమర్శించే వారి మాటలు వింటే 100 ఏళ్లు వెనిక్కి పోతామన్నారు.ఈ ప్రభుత్వం మహిళలను అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో ఆకాశమే హద్దుగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటు న్నామని మంత్రి సీతక్క తెలిపారు.