Saturday, April 5, 2025

కాలేజీలో ఎల్ఎల్ఎం చదుకువుంటున్న మంత్రి సీతక్క

* కాలేజీలో ఎల్ఎల్ఎం చదుకువుంటున్న మంత్రి సీతక్క
* చదువుకు వయసుకు సంబంధం లేదన్న మంత్రి
తాను రాజకీయాల్లో ఉండి, ఎమ్మెల్యేనై, ఇప్పుడు మంత్రి అయినా నిత్య విధ్యార్ధినేనని చెప్పారు తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. పదవ తరగతి చదివిన తరువాత వ్యవస్థలో మార్పు కోసం గన్ను పట్టానని గుర్తు చేసుకున్న సీతక్క.. మళ్లీ సమాజ సేవ కోసం తిరిగి జనజీవస్రవంతిలోకి వచ్చానని చెప్పుకొచ్చారు. ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆమె.. ఎమ్మెల్యేగా గెలుపొంది.. ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్నారు. ఐనా చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష అక్కడితో ఆగిపోలేదు. ప్రస్తుతం మంత్రి సీతక్క ఎల్‌ఎల్‌ఎం రెండవ సంవత్సరం చదువుతున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన మంత్రి సీతక్క.. చదువుకు వయసుతో సంబంధం లేదనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలని అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని సందర్శించిన సీతక్క.. ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థిని మహేశ్వరిని ప్రత్యేకంగా అభినందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఈ సందర్బంగా సీతక్క చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com