Wednesday, November 6, 2024

త‌ల తాక‌ట్టు పెట్టైనా ఇందిర‌మ్మ ఇళ్లు పూర్తిచేస్తాం..

ఇండ్ల నిర్మాణం ప్ర‌భుత్వానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం
ఈనెల 5, 6 తేదీల నుంచి ల‌బ్దిదారుల ఎంపిక‌
మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి చిట్ చాట్

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి కాస్త ఇబ్బందిక‌రంగా ఉన్నా కూడా త‌ల తాక‌ట్టు పెట్టైనా స‌రే ఇందిర‌మ్మ ఇళ్లు పూర్తి చేసి తీరుతామ‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం త‌మ ప్ర‌భుత్వానికి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 15రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ల‌బ్ధిదారుల‌ ఎంపిక పూర్తి చేసి ఆ వెంట‌నే జాబితాను ఖ‌రారు చేస్తామ‌ని, ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని మంత్రి పొంగులేటి స్ప‌ష్టం చేశారు. గ్రామాల‌లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే ఫైన‌ల్ అని, ఇండ్లు మ‌హిళ‌ల పేరిటే మంజూరు చేస్తామ‌ని, ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. ఎటువంటి రాజ‌కీయ జోక్యం ఉండ‌ద‌ని, నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని తెలిపారు. పేద‌రిక‌మే ప్రామాణికంగా ల‌బ్దిదారుల ఎంపిక ఉంటుంద‌ని, ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని వివ‌రిచారు.

ఆధార్‌తో స‌హా అన్నివివరాలు యాప్ లో పొందుప‌రుస్తారని, 4 రాష్ట్రాలలోని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వివ‌రాలు సేక‌రించి ముందుకు వెళ్తున్నామ‌ని మంత్రి పొంగులేటి వివ‌రించారు.ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండ‌వు, ల‌బ్దిదారుల ఇష్టం మేర‌కు ఇల్లు నిర్మించుకోవ‌చ్చు క‌నీసం 400 చ‌ద‌ర‌పు గ‌జాలు త‌గ్గ‌కుండా ల‌బ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాల‌ని, నాలుగు ద‌శల్లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఉంటుంద‌ని, నిర్మాణ ద‌శ‌ల వారీగా ల‌బ్దిదారుల‌కు చెల్లింపులు ఉంటాయ‌ని తెలిపారు. పునాదికి ల‌క్ష‌, గోడ‌ల‌కు లక్షా 25వేలు, శ్లాబ్‌కు ల‌క్ష‌న్న‌ర‌, పూర్త‌యితే ల‌క్ష రూపాయిల చొప్పున బ్యాంకు అకౌంట్ ద్వారానే చెల్లింపులు చేస్తామ‌ని తెలిపారు.

కేంద్రం ఇచ్చే నిధుల‌ను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భ‌రిస్తుంద‌ని, నాలుగు సంవ‌త్స‌రాల‌లో 20 లక్ష‌ల ఇండ్లు నిర్మిస్తామ‌ని, ప్ర‌తి నియోజ‌క‌వర్గంలో క‌నీసం 3500 ఇండ్లు నిర్మించేలా చూస్తామ‌న్నారు.ఇండ్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా వంట‌గ‌ది, బాత్రూం నిర్మించుకోవాల‌ని, ప్ర‌తి మండ‌లంలో కనీసం ఒక‌రు లేదా ఇద్ద‌రు ఏఈలు ఉండేలా చ‌ర్య‌లు తీసుకంటున్న‌ట్లు తెలిపారు. 16 శాఖ‌ల‌కు చెందిన వారిని స‌మీక‌రించి ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ బాధ్య‌తలు అప్ప‌గిస్తామ‌ని, ఒకే గొడుగు నీడ‌న ఇంజ‌నీర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇండ్ల నిర్మాణం జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ప్ర‌భుత్వం త‌ర‌పున 5 ల‌క్ష‌ల సాయం ఇస్తాం, ల‌బ్దిదారులు ఆర్థిక ప‌రిస్దితి బ‌ట్టి ఇంకా క‌ట్టుకోవ‌చ్చు. దేశంలో తెలంగాణ మాత్ర‌మే ఇంత‌టి భారీ గృహ నిర్మాణం చేప‌ట్టి, 5 ల‌క్ష‌ల సాయం అందిస్తోంది. గ‌త ప్ర‌భుత్వంలో నిలిచిపోయిన సుమారు 600 -800 ఇండ్ల నిర్మాణానికి కూడా స‌హ‌క‌రిస్తాం. తొలి విడతగా సుమారు 28 వేల కోట్ల రూపాయిల వ‌ర‌కు కోట్లు ఖ‌ర్చు కావ‌చ్చు. సుమారు 7,740 కోట్ల రూపాయిల‌ను ఇందిర‌మ్మ ఇండ్లకు బ‌డ్జెట్‌లో కేటాయించాం. అవ‌స‌ర‌మైన నిధుల కోసం కేంద్రాన్ని కోరుతాం, నిధుల‌ను వివిధ మార్గాల‌ద్వారా స‌మీక‌రిస్తాం. పునాది పూర్త‌యిన వెంట‌నే తొలివిడ‌త నిధుల విడుద‌ల చేస్తాం. నిర్మాణాలు జ‌రిగేలోగా మ‌ళ్లీ బ‌డ్జెట్‌లో నిధుల కేటాయింపు జ‌రుగుతుంద‌ని తెలిపారు.

స్మార్ట్ కార్డుల ఆధారంగా ల‌బ్దిదారుల ఎంపిక చేస్తామ‌ని, నంద‌నవ‌నం, మంకాల్ ఇండ్ల స‌మ‌స్య‌కు త్వ‌ర‌లో ప‌రిష్కారం చూపుతామ‌ని, ఇండ్ల స్ధ‌లాలు లేనివారికి 2వ ద‌శ‌లో స్ధ‌లంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం 75 నుంచి 80 గ‌జాల స్ధ‌లాన్ని స‌మ‌కూర్చి ఇస్తామ‌ని, ఎక్క‌డైనా కొత్త‌గా ఇందిర‌మ్మ కాల‌నీలు ఏర్ప‌డితే క‌రెంట్‌, రోడ్లు , డ్రైనేజ్ త‌దిత‌ర మౌళిక వ‌స‌తుల‌ను ప్ర‌భుత్వమే స‌మ‌కూరుస్తుందని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం మూసివేసిన హౌసింగ్ శాఖ‌ను పున‌రుద్ద‌రించామ‌ని, ఎన్నిక‌ల వ‌ర‌కే రాజ‌కీయాలు, ఎలాంటి భేషజాల‌కు పోవ‌డంలేద‌ని, కేంద్రం ఎంతిచ్చినా తీసుకుంటామ‌ని, , ఏమీ ఇవ్వ‌క‌పోయినా ఇందిర‌మ్మ ఇండ్ల‌ను నిర్మిస్తాం, మాకు ఇగోలు లేవని మంత్రి స్పష్టం చేశారు. గ‌త ప్ర‌భుత్వం ధ‌నిక రాష్ట్రమ‌ని చెప్పి కేంద్రాన్ని ఇండ్లు అడ‌గ‌లేదు. డబుల్ బెడ్ రూం ఇండ్ల‌లో నీళ్లు, క‌రెంట్ , డ్రైనేజ్ వంటి వ‌స‌తుల్లేవు. మేము అవ‌న్నీ క‌ల్పించి ల‌బ్దిదారుల‌కు అప్ప‌గిస్తున్నామ‌ని, 2004 నుంచి 2014 వ‌ర‌కు ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలంగాణ ప్రాంతంలో 19.36 ల‌క్ష‌ల ఇందిరమ్మ ఇండ్ల‌ను నిర్మించార‌ని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular