Monday, March 10, 2025

రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు

  • నిర్మాణ రంగంలో హరిత భవనాలు
  • ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధరబాబు చెప్పారు. మరీముఖ్యంగా ఐటీ రంగంలో విరివిగా పెట్టుబడులు వస్తున్నాయని, దీనివలన ఉద్యోగాలతో పాటు పరోక్షంగా ఎన్నో అవకాశాలు లభిస్తాయని అన్నారు. రానున్న నాలుగేళ్ళలో ఐటీ రంగమును విస్తృత అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెట్టుబడులు తెచ్చేనందుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్త పాలిసీలు తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో 2వ ఎడిషన్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపతున్నామని చెప్పారు. సులభతర వాణిజ్య విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెట్టుబడిదారులు, నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఆయన తెలిపారు. నిర్మాణ రంగంలో పర్యావరణ హితమైన గ్రీన్ బిల్డింగ్స్ ( హరిత భవనాలు ) పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

హరిత భవనాల గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలని చెప్పారు. 2003లో హరిత భావనాల నిర్మాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైందని తెలిపారు. 20ఏళ్లలో క్రమంగా హరిత భవనాల నిర్మాణం జరిగితూ వస్తోందని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ వినియోగంపై అప్పటి మన్మోహన్ సర్కారు కఠిన చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆకస్మిక తనిఖీలు చేశానని గుర్తు చేశారు. కర్భన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీధర్ బాబు అన్నారు. పిలుపునిచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com