Sunday, March 9, 2025

బిజెపి, బిఆర్‌ఎస్‌లది ఫెవికాల్‌ ‌బందం

  • బిజెపి, బిఆర్‌ఎస్‌లది ఫెవికాల్‌ ‌బందం
  • ఆ పార్టీల చీకటి ఒప్పందాలు బయటికొస్తున్నాయ్‌..
  • బిజెపికి మేం త్వరలో మంచి గిఫ్ట్ ఇస్తాం..
  • బండి సంజయ్‌ ‌రంజాన్‌ ‌గిఫ్ట్ ‌వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌ ‌బాబు కౌంటర్‌

మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చామని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కలిసి రంజాన్‌ ‌గిఫ్ట్ ఇచ్చాయా?  అని మంత్రి శ్రీధర్‌ ‌బాబు ప్రశ్నించారు.  మేం కూడా బీజేపీకి త్వరలోనే మరో గిఫ్ట్ ఇస్తామన్నారు.  గాంధీభవన్‌ ‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లడారు.  బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌మధ్య ఒప్పందాలు బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్‌ ‌వోటర్ల తీర్పును గౌరవిస్తున్నాం  నరేందర్‌ ‌రెడ్డికి వోటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించేందుకు బీఆర్‌ఎస్‌ ‌బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌ఫెవికాల్‌ ‌బంధాన్ని మరింత దృఢం చేసేందుకు ఆయా పార్టీల గట్టిగా కృషి చేశారు. బీఆర్‌ఎస్‌ ‌తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు..? బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు రవీందర్‌ ‌సింగ్‌ ‌కి వొచ్చిన వోట్లు ఎన్ని? తనకు బీఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ సహకారం ఇచ్చిందని రవీందర్‌ ‌సింగ్‌ అన్నారు.. బీజేపీకి తోడుగా బీఆర్‌ఎస్‌ ‌నిలబడిందని మంత్రి శ్రీధర్‌ ‌బాబు విమర్శించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com