Tuesday, November 19, 2024

‘జోయెటిస్’ సామర్థ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

పశు వైద్య రంగంలో ప్రపంచ దిగ్గజం జోయెటిస్ ప్రవేశంతో లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కొత్త మైలు రాయిని దాటిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాయదుర్గంలో మంగళవారం ఆయన జోయెటిస్ గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని(జిసిసి) ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. పశువులు, పెంపుడు జంతువుల ఔషధాలు, పోషకాల ఉత్పత్తిలో జోయెటిస్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఆ సంస్థ ఇక్కడ 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి బిజినెస్ ఆపరేషన్స్, డేటా మేనేజ్ మెంట్, పరిశోధన, అభివృద్ధి లాంటి కార్యకలాపాలను నిర్వహిస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఇటీవల తమ అమెరికా పర్యటన సమయంలో సిఎం రేవంత్ రెడ్డి, తాను జోయెటిస్ యాజమాన్యంతో చర్యలు జరిపామని ఆయన గుర్తు చేసారు. తమ ఆహ్వానాన్ని మన్నించి అతి తక్కువ సమయంలో వారు ఇక్కడ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషం కలిగిస్తోందని మంత్రి అన్నారు.

2025 చివరి నాటికి వందలాది మంది సాఫ్ట్ వేర్, పశువైద్య నిపుణులకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ఈ జిసిసి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెటర్నరీ వైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, పశువులు, జీవాల పెంపకదారులకు ఔషధాల సరఫరా, ఆరోగ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు సూచనలు అందించే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో జోయెటిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సార్బౌగ్, జోయెటిస్ ఇండియా సామర్థ్య కేంద్రం వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్, టీజీఐఐసి సిఇఓ మధుసూదన్, తెలంగాణా లైఫ్ సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబుతో అమెరికన్ కాన్సులేట్ అధికారుల భేటీ : సచివాలయంలో మంగళవారం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో అమెరికన్ కాన్సులేట్ అధికారులు భేటీ అయ్యారు. వారిలో యాక్టింగ్ కాన్సుల్ జనరల్ రెబెకా డ్రేమే , యుఎస్ ఆర్థిక వ్యవహారాల సీనియర్ సలహాదారు నెల్సన్ కన్నింగ్ హామ్, హైదరాబాద్ కాన్సులేట్ వైస్ కాన్సుల్ అఖిల్ బెరి , హైదరాబాద్ కాన్సులేట్ పొలిటికల్, ఎకనమిక్ చీఫ్ ఫ్రాంక్ టల్లుటో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular