Wednesday, October 2, 2024

మూసీ రివర్ ఫ్రంట్ తెచ్చింది ఎవరు?

కేటీఆర్‌కి మంత్రి శ్రీధర్​ బాబు కౌంటర్​

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్‌ను నిర్ణయించిం జీవో జారీ చేయడమే కాకుండా, 2017లో మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు మూసీ ప్రక్షాణపై బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు.

గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. గతంలో మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా? అంటూ ప్రశ్నించారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా? అని నిలదీశారు. 2021లో మూసీ నది ప్రక్షాళనపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎన్నో సమావేశాలు నిర్వహించారని, మాస్టర్ ప్లాన్‌ను పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారని వెల్లడించారు. అప్పటి అధికారుల లెక్కల ప్రకారం 8,480 అక్రమ కట్టడాలు ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. మూసీ నిర్వాసితులకు పరిహారంపై కూడా మరో సమావేశంలో కేటీఆర్ చర్చించారని తెలిపారు.

ప్రజలకు పరిశుభ్రమైన గాలి, నీరు అందించాలనే ఆలోచన చేశారని మేం కూడా అనుకున్నామన్నారు. కానీ బీఆర్ఎస్ మాటలన్నీ కేవలం పేపర్లకే పరిమితమై.. మాటలతోనే కాలం గడిపారని విమర్శించారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రక్రియ చాలా క్లిష్టమైందని వెల్లడించారు. ఈ సమస్యలను బీఆర్ఎస్ నేతలు ఇంకా జఠిలం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ ఉపయోగపడే పనులపై బీఆర్ఎశ్ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular