Friday, May 9, 2025

ఈ సీజన్ లోనే రైతులకు పెద్ద వాగు నీళ్లు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్ట మరమ్మత్తు పనులు సత్వరమే చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. ఈ వానాకాలంలోనే రైతులకు సరిపడ సాగునీరు అందే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మరమ్మత్తులు కోసం అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు.

ప్రాజెక్టు తాత్కాలిక మరమ్మత్తులు, బండ్ ఫార్మేషన్ అప్రోచ్ కెనాల్ పనులు కోసం అడిగిన వెంటనే స్పందించి సీఎం రేవంత్ రెడ్డి, నీరు పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రూ. 3 కోట్ల 50 లక్షలతో అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఈ సీజన్ లోనే ప్రాజెక్ట్ తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి ఆయకట్టు కింద రైతుల పంటలకు సాగునీరు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. పెద్దవాగు ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులు కోసం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com