Monday, April 21, 2025

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హుజూర్ నగర్ నుంచి జాన్ వహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా మంత్రి ఉన్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడ్డారు. ఉత్తమ్ తన నియోజకవర్గమైన హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి మంత్రి కారును ఆపమని డ్రైవర్ కు సూచించారు. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకాల ఉన్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పిల్చుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది. అనంతరం మంత్రి కారు వెళ్లిపోవటంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com