Tuesday, December 24, 2024

రౌడీ హీరోకి గాయాలు… అలా.. ఎలా..?

రౌడీ స్టార్‌ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న కొత్త‌ చిత్రంలోని యాక్ష‌న్ సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ‘వీడీ12’ వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలోని ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తుండ‌గా విజ‌య్‌కు స్ప‌ల్ప గాయ‌మైంది.
దాంతో చిత్రం యూనిట్ వెంట‌నే ఆయ‌న‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించింది. అక్క‌డ ఫిజియోథెర‌పీ చేసిన అనంత‌రం మ‌ళ్లీ విజ‌య్ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ మూవీలో విజ‌య్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 2025 మార్చి 28న సినిమా విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత రాహుల్ సాంకృత్యాయ‌న్‌, ర‌వికిర‌ణ్ కోలా డైరెక్ష‌న్‌ల‌లో వ‌రుస‌గా రెండు సినిమాల్లో విజ‌య్ న‌టించ‌నున్నాడు. ఈ మధ్య విజయ్‌ కెరీర్‌ గ్రాఫ్‌ చూసుకుంటే కాస్త స్లోగానే నడుస్తుంది. అంతేకాక ఇటీవల విడుదలైన సినిమాలన్నీ కూడా కాస్త ఫ్లాప్‌ బాట పట్టినట్టే ఉన్నాయి. మరి ఈ రాబోయే చిత్రాలు మనోడికి ఎలాంటి పేరును తెస్తాయో వేచి చూడాలి మురి.

 

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com