Wednesday, April 2, 2025

Minor girl assault and murder: మలక్ పేట లైంగిక దాడి ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం

వ‌స‌తి గృహ వార్డెన్ పై స‌స్పెన్షన్ వేటు

మలక్ పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ‌స‌తి గృహ వార్డెన్ ను వెంట‌నే స‌స్పెండ్ చేయాల‌ని అధికారుల‌కు మంత్రి ఆదేశాలు జారి చేసారు.

లైంగిక దాడి ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే, సంబంధిత అధికారుల నుంచి మంత్రి నివేదిక‌ కోరారు. ఘ‌ట‌న‌పై వెంట‌నే ఉన్నత స్థాయి క‌మిటీని నియ‌మించి స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న, విధుల ప‌ట్ల అల‌స‌త్వం వ‌హించిన సిబ్బందిపై చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితురాలికి సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. నిందితుడికి క‌ఠిన శిక్ష ప‌డేందుకు శాఖ ప‌రంగా చర్యలు తీసుకోవాల‌ని మంత్రి సీత‌క్క ఆదేశించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com