Wednesday, April 2, 2025

ట్యూషన్‌ టీచర్‌ తో మైనర్ స్టూడెంట్ ప్రేమ వ్యవహారం

చివరికి పోలీస్స్టేషన్-కోర్టు దాకా ప్రేమాయణం

ఓ ట్యూషన్ టీచర్ కు,స్టూడెంట్ కు మధ్య ప్రేమ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్, ఆ తరువాత కోర్టు చె వరకు వెళ్లడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.తమిళనాడు రాజధాని చెన్నై లో ఈ ఘటన చోటుచేసుకుంది. నగర శివారులోని పెరియామెట్‌లో ఇరవై రెండేళ్ల ట్యూషన్‌ టీచరుతో 17 ఏళ్ల ఓ మైనరు ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులు వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు. ఐతే ఏమైందో తెలియదు కానీ ఇటీవలి టీచర్ మైనర్ స్టూడెంట్ ను దూరం పెట్టింది. దీంతో టీచర్ పై ఆతడు పగనుపెంచుకున్నాడు. ఆమెపై పగను సాధించేందుకు వినూత్న వేధింపులకు పాల్పడ్డాడు.

Also Read: ఫ్లైఓవర్‌ రూట్స్ కోసం గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్

తన ట్యూషన్ టీచర్ పేరితో వాళ్ల ఇంటి అడ్రస్ కు వందలాది క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆన్‌లైన్‌ ఆర్డర్లు పంపించాడు. అంతేకాదు మొత్తం 77 సార్లు ఓలా, ఊబర్‌ రైడ్స్‌ను బుక్‌ చేసి ఆమెను వేధించాడు. తన ప్రమేయం లేకుండా వస్తున్న ఆర్డర్స్‌  ఒకవైపు, ఊబర్, ఓలా క్యాబ్స్ మరో వైపు వచ్చేసరికి వాళ్లకు సమాధానం చెప్పలేక ఆమె, ఆమెతో పాటు కుటుంబం తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంది. ఇక చేసేది లేక గుర్తుతెలియని ఫోన్‌ నంబరు నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ ఈ నెల 2న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్ చేశారామె కుటుంబ సభ్యులు.

ట్యూషన్ టీచర్ కుటుంబంఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫోన్‌ నంబరు, ఈ మెయిల్‌ ఆధారంగా ఆమె దగ్గర ట్యూషన్ చెప్పించుకున్న మైనర్ స్టూడెంట్ పనేననిగుర్తించారు. అతన్ని అరెస్ట్‌ చేయడంతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక వైఫై రూటర్‌ను సీజ్‌ చేశారు. ఆ తరువాత మైనర్ స్టూడెంట్ను కోర్టులో హాజరుపరచగా మానసిక ఆరోగ్యం గురించి కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆదేశించిందికోర్టు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com