Thursday, February 13, 2025

మిరాయ్- బ్లాక్ స్వోర్డ్ గ్లింప్స్ లాంచ్

రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ఎనిమిదేళ్ల విరామం తర్వాత వెండితెరపై మ్యాసీవ్ గా కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మిరాయ్‌’లో తన లేటెస్ట్ అవతార్‌తో సూపర్ హీరో యూనివర్స్ ని ‘ది బ్లాక్ స్వోర్డ్’గా రిడిఫైన్ చేశారు. తేజ సజ్జా ది సూపర్ యోధగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. మనోజ్ మంచు పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ రివీల్‌లో, మేకర్స్ మంచు మనోజ్ ది బ్లాక్ స్వోర్డ్‌గా ఫస్ట్ లుక్ గ్లింప్‌ను లాంచ్ చేశారు.

ఈ గ్లింప్స్ లో మంచు మనోజ్‌ను మునుపెన్నడూ చూడని ఇంటెన్స్, పవర్ ఫుల్ అవతార్‌లో కనిపించారు, ఒక స్ట్రెంజ్ వెపన్ తో ఊచకోత కోయడం నెక్స్ట్ లెవల్ లో వుంది. తన కమాండింగ్ ప్రజెన్స్, అతని పాత్ర బలం, బ్లాక్ స్వోర్డ్‌గా కథనంలో ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. పోనీటైల్, స్టైలిష్ గడ్డంతో పొడవాటి జుట్టుతో, మనోజ్ పరిచయ సన్నివేశంలో లాంగ్ కోట్‌లో డెడ్లీగా, అదే సమయంలో అల్ట్రా-ఫ్యాషన్‌గా కనిపించారు. ఆ తర్వాత టీ-షర్ట్‌తో బ్లేజర్‌లో మరొక యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్ వచ్చింది. ఈ పాత్ర చిత్రానికి కొత్త కోణాన్ని జోడించి, నటుడిగా అతని వెర్సటాలిటీ, అంకితభావాన్ని చూపించింది. అతని పాత్ర యొక్క ప్రయాణం ప్రేక్షకులని లీనం చేస్తూ, సినిమా మొత్తం ప్రభావాన్ని పెంచుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com