- తలుపులు, స్టీల్ సామగ్రిని ఎత్తుకెళ్లిన దుండగులు
- ఆర్ అండ్ బి అధికారుల ఫిర్యాదు మేరకు
- కేసు నమోదు చేసిన పోలీసులు
బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన ఈ దొంగతనం కలకలం రేపుతోంది. మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కట్టడాల్లో జరుగుతున్న చోటు నుంచి నిర్మాణ సామగ్రి చోరీకి గురైంది. కన్‌స్ట్రక్షన్ సైట్ నుంచి తలుపులు, స్టీల్ సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు.
ఈ క్రమంలోనే ఆర్ అండ్ బి అధికారి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అత్యంత హై సెక్యూరిటీతో ఉండే మంత్రుల నివాసంలోనే ఈ దొంగతనం జరగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తలుపులు, స్టీల్ వస్తువులు దొంగిలించిన వారి కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.