Saturday, May 10, 2025

నాడు మిస్​ ఇండియా పోటీలు నేడు మిస్​ వరల్డ్​ పోటీలు

ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్​ మహానగరం ముస్తాబైంది. ఇలా ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్​ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే పుష్కరకాలం క్రితం మిస్​ యూనివర్స్​ ఇండియా పోటీలు హైదరాబాద్​లో జరిగాయి. 2012లో ఐయామ్​ షీ పేరుతో నిర్వహించిన ఈ పోటీలకు శామీర్​పేటలోని లియోనియో రిసార్ట్​ వేదిక అయింది. అందాల పోటీలు, ఫ్యాషన్​ షోలకు మనదేశంలో ముంబయి పేరొందింది. మిస్​ ఇండియాతో సహా ఎలాంటి అందాల పోటీలైనా అక్కడే నిర్వహిస్తారు. ఈ క్రమంలో 2012లో మొదటిసారి ముంబయి వెలుపల నిర్వహించాలనుకున్నారు. అందుకు హైదరాబాద్​నే ఉత్తమమైన నగరం అని అనుకుంది. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 18 ఏళ్లు నిండి 27 ఏళ్లలోపు ఉన్న అందగత్తెలను స్క్రీనింగ్​ చేసి టాప్​ 20 మందిని ఆనాడు ఎంపిక చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా శిక్షణ : అందాల కిరీటాన్ని అందుకోవాలని కలలు కనేవారిలో అందరూ దాదాపు కొత్తవాళ్లే ఉంటారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా వీరిని తీర్చిదిద్దేందుకు నాడు ఓ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిస్​ యూనివర్స్​-1994 విజేత, ఐయామ్​ షీ వ్యవస్థాపకురాలు సుస్మితాసేన్​ మెంటార్​గా వ్యవహరించి వారికి గ్రూమింగ్​ నిర్వహించారు. ఆహారపు అలవాట్ల నుంచి ఫిట్​నెస్​, చర్మ, కేశ సౌందర్యం వరకు, ర్యాంప్​పై నడక నుంచి నృత్యం వరకు మెరుగులు దిద్దారు. అలాగే వీరికి దేశంలో పేరొందిన ఫ్యాషన్​ నిపుణులు, బాలీవుడ్​ ప్రముఖులు తర్ఫీదు ఇచ్చారు. ఎన్నో మెలకువలు నేర్పారు. టాప్​ 20లో తెలుగు మోడల్​ కూడా ఒకరు పోటీపడ్డారు. అయితే చివరి దశకు చేరుకోలేపోయింది ఆమె.

నాడు ముగ్గురు ఎంపిక
మొత్తం 20 మందికి వివిధ రౌండ్లలో పోటీలు నిర్వహించి అత్యుత్తమంగా నిలిచిన ముగ్గుర్ని తుది పోటీలకు ఎంపిక చేశారు. వీరిలోంచి ఒకరిని మిస్​ యూనివర్స్​కు, మరొకరిని మిస్​ గ్లోబ్​ ఇంటర్నేషనల్​కు, ఇంకొకరిని మిస్​ ఏషియా పసిఫిక్​ వరల్డ్​-2013కు పంపించారు. ఆ ఏడాది ఉత్తరాఖండ్​కు చెందిన ఊర్వశి రౌతేలా మిస్​ ఇండియా యూనివర్స్​గా ఎంపిక అయ్యారు. తొలి రన్నరప్​గా బిహార్​కు చెందిన శిల్పాసింగ్​, రెండో రన్నరప్​గా మహారాష్ట్రకు చెందిన అర్లెట్టీ ఎవిటా గ్రావో ఎంపిక అయ్యారు. అయితే, రౌతేలా వయసు సరిపోకపోవడంతో శిల్పాసింగ్​ను భారత్​ తరఫున మిస్​ యూనివర్స్​ పోటీలకు పంపించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com