Friday, May 16, 2025

మిస్ యూనివర్స్ ఆంధ్రా కుప్పం అమ్మాయి

  • మిస్ యూనివర్స్ ఆంధ్రా కుప్పం అమ్మాయి
  • ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఆడిషన్ పోటీలు

మిస్ యూనివర్స్ ఆంధ్రాగా కుప్పం అమ్మాయి ఎంపికయ్యింది. హైదరాబాదులోని శ్రీనగర్‌కాలనీ లో ఆదివారం మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేట్ 1వ ఆడిషన్ ఫినాలే పోటీలు జరిగాయి. ఈ ఆడిషన్ లో ఏపీలోని కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలానికి చెందిన చందన జయరామ్ మిస్ యూనివర్స్ ఆంధ్రగా ఎంపికయ్యింది. కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఎంకేపురంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన చందన జయరామ్ హైదరాబాద్ లో టూరిజం-హాస్పటాలిటీ కోర్సు పూర్తి చేసింది.

మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే ర్యాంప్ పై నడుస్తున్నటాప్ మోడల్స్ సోయగాలు ఆహుతులను ఆలరించాయి. మొత్తం మూడు రాష్ట్రాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు క్యాట్వాక్తో అలరించి విజేతలుగా నిలిచారు. మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ చందన జయరామ్, మిస్ యూనివర్స్ తెలంగాణగా నిహారిక సూద్, మిస్ యూనివర్స్ కర్ణాటకగా అవనీ కాకేకోచి టైటిల్ క్రౌన్ గెలుచుకున్నారు. ర్యాంప్ పై వాక్ చేసిన అందాల తారలను బ్యూటీ, ఫ్యాషన్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విజేతలుగా ఎంపిక చేశారు. మిస్ యూనివర్స్ ఆంధ్రాగా కిరీటాన్ని సొంతం చేసుకోవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసింది చందన జయరామ్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని అమె ధీమా వ్యక్తం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com