నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్ధినిల మిస్సింగ్ కలకలం రేపుతోంది. గర్ల్స్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న శిరీష, వరలక్ష్మీ, రవలిక అనే అమ్మాయిలు మిస్సయ్యారు. స్కూల్కని వెళ్లిన ముగ్గురు రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో స్కూల్ గర్ల్స్ మిస్సింగ్ కలకలం రేపుతోంది.
నవీపేట్ లోని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న శిరీష, వరలక్ష్మీ, రవళి అనే అమ్మాయిలు కనిపించకుండా పోయారు. రోజూలానే స్కూల్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ముగ్గురు స్తూడెంట్స్ రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్ధినిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.